Natyam ad

చౌడేపల్లెలో 27న జోనల్‌ క్రీడలను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

చౌడేపల్లె ముచ్చట్లు:


చిత్తూరు జిల్లా గ్రిగ్‌ మెమోరియల్‌ పుంగనూరు జోనల్‌ స్థాయి క్రీడా పోటీలను విజయవాణి రెసిడియన్సీ స్కూల్‌ ఆవరణంలోశుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్నట్లు విజయవాణి విద్యా సంస్థల కరస్పాడెంట్‌ నాయుని చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు మంత్రిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తోపాటు క్రీడాకారులనుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు.అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. ఈమేరకు వేడుకగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి క్రీడాకారులు , ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 

Tags: Minister Peddireddy will inaugurate the zonal sports on 27th at Chaudepalle

Post Midle
Post Midle