పుంగనూరులోమంత్రి పెద్దిరెడ్డి పుట్టినరోజు వేడుకలు
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలను బుధవారం బస్టాండులో మంత్రి పెద్దిరెడ్డి నిలువెత్తు ప్లెక్సిలను ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ఆధ్వర్యంలో రాష్ట్ర జానపద కళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కౌన్సిలర్లు , పార్టీ నాయకులు కలసి కేక్ కట్ చేసి, సంబరాలు జరిపారు. అలాగే మండల కార్యాలయం వద్ద ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , బోయకొండ చైర్మన్ నాగారాజారెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మంత్రి పీఏ చంద్రహాస్, ఎంపీడీవో నారాయణ, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కలసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. డాక్టర్ శివ ఆధ్వర్యంలో పట్టణంలో 65 వేల మందికి సుమారు రూ.1 5 లక్షలు విలువ చేసే హ్గమియో మందులను ఇంటింటికి పంపిణీ చేశారు. అలాగే మిధున్‌రెడ్డి యువజన సంఘ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో 2000 వేల మందికి అన్నదానం చేశారు. తుంగామంజునాథ్ ఆధ్వర్యంలో శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో పూజలు చేసి 73 టెంకాయలు కొట్టారు. అంబేద్కర్ సర్కిల్‌లో దళిత నాయకులు రాజు, శంకరప్ప, కృష్ణప్ప, చెన్నరాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, నరసింహులు, నటరాజ, కాళిదాసు, రెడ్డెమ్మ, కిజర్‌ఖాన్, రేష్మా, అర్షద్‌అలి, సాజిదాబేగం, భారతి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Peddire ddy’s birthday celebrations at Punganur
