Natyam ad

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి పుట్టినరోజు వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 72వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం మండల కార్యాలయం వద్ద ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగారాజారెడ్డి, మంత్రి పీఏ చంద్రహాస్‌, ఎంపీడీవో రామనాథరెడ్డి, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కలసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే బస్టాండులో మంత్రి పెద్దిరెడ్డి నిలువెత్తు కటౌట్లను ఏర్పాటు చేసి రాష్ట్ర జానపద కళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు , పార్టీ నాయకులు కలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు జరిపారు. మిధున్‌రెడ్డి యువజన సంఘ అధ్యక్షుడు రాజేష్‌ ఆధ్వర్యంలో 2000 వేల మందికి అన్నదానం చేశారు. అలాగే అంబేద్కర్‌ సర్కిల్‌లో రాగానిపల్లెబాబు అన్నదానం చేశారు. తుంగామంజునాథ్‌ ఆధ్వర్యంలో మారెమ్మ ఆలయంలో పూజలు చేసి 72 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, అమ్ము, నటరాజ, తుంగామంజునాథ్‌, కిజర్‌ఖాన్‌, ఇంతియాజ్‌ఖాన్‌, సురేష్‌, బండకుమార్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Minister Peddireddy’s birthday celebrations at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.