Natyam ad

1న మంత్రి పెద్దిరెడ్డి ప్రచార పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఉదయం 7 గంటలకు బ్రాహ్మణవీధిలో గల సాయిబాబా ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆంజనేయస్వామి గుడివీధి, ఏవి.రావువీధి, హైస్కూల్‌వీధి, కోనేటిపాళెం, తాటిమాకులపాళెం, వివేకానంద నగర్‌, షిరిడిసాయినగర్‌, శివసాయినగర్‌, దోబీకాలనీ, మార్సక్నగర్‌, హిదాయత్‌నగర్‌, ఎంబిటి రోడ్డు, కొత్తయిండ్లు, ఎల్‌ఐసీ కాలనీ, టీచర్స్ కాలనీలలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈప్రచార కార్యక్రమాల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు తప్పక పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Minister Peddireddy’s campaign tour on 1st

Post Midle