బడుగుల అభ్యున్నతే మంత్రి పెద్దిరెడ్డి ధ్యేయం

– అక్కిసాని భాస్కర్ రెడ్డి

Date:20/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్యేయమని ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్ రెడ్డి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ పదవుల్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. ఇందులో భాగంగా విరశైవ లింగాయత్ కార్పొరేషన్ లో పుంగనూరు మండలం ఆరడిగుంటకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థి నంజుండప్ప భార్య డి. శోభను డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా 12మందిలో పుంగనూరు మండలానికి ఒక్క పోస్టు రావడానికి కారణం బడుగులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు ఉన్న ప్రేమేనన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కులాలు, మతాలకు అతీతంగా పని చేస్తారు అనడానికి ఈ నియామకం నిదర్శనమన్నారు. విరశైవ లింగాయత్ కార్పొరేషన్ సముచిత స్థానం కల్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.

14 ఏళ్ల లోపు పిల్లలను పనులకు వినియోగించరాదు

Tags; Minister Peddireddy’s goal is to uplift the bar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *