Minister Pedroreddy's meeting on Corona

కారోనా పై మంత్రి   పెద్దిరెడ్డి సమావేశం

Date:26/03/2020

తిరుపతిముచ్చట్లు:

-ఆంధ్రప్రదేశ్ సీఎం ఆదేశాలు ఇలా ..

► నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలి. ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలి.

► కూరగాయలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలి. అంత వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం
1 గంట వరకూ అనుమతించాలి.

► సప్లై చెయిన్‌ దెబ్బ తినకుండా గూడ్స్‌ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలి.

► నిత్యావసరాల షాపుల వద్ద ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్‌ ఉండాలి.

► ప్రజలు నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలి. ఎవరూ కూడా 2 లేదా 3 కి.మీ పరిధి దాటి రాకూడదు. ఆ మేరకు అందుబాటులో ఉండేలా అధికార యంత్రాంగం చూసుకోవాలి. పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి.

► ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని,  సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి

► కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలి. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే 1902కు కాల్‌ చేయాలి.

21 రోజుల పాటు లాక్​డౌన్ ప్రధాని నరేంద్రమోదీ.

Tags: Minister Pedroreddy’s meeting on Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *