Natyam ad

పాలేరు లో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం ముచ్చట్లు:


ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు.నియోజకవర్గంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. అనంతరం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను అందించారు.ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా రైతులు తమ పంటలకు సాగునీరు కావాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వారితో మాట్లాడిన ఆయన  ఎప్పుడెప్పుడు నీరు కావాలో చెపితే అధికారుల తో మాట్లాడి నీరు ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు.

 

Tags: Minister Ponguleti’s visit to Paleru

Post Midle
Post Midle