గాంధారి మండలంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన

కామారెడ్డి ముచ్చట్లు:

 

పల్లె ప్రగతిలో  భాగంగా కామారెడ్డి జిల్లా  గాంధారి మండలంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు.మండల  కేంద్రంలో 10 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ పై హాట్ కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో  బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడట.రాష్ట్రంలో రెండు వేల పెన్షన్ ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా, రైతుబంధు ఇస్తున్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా కెసిఆర్ కిట్ లు ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా,లేకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న స్కీములను ఒక్కటినన్న చేసి  చూపించి పాదయాత్ర చేయమని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నూతన టీపీసీసీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి  ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఉన్నాడని, కెసిఆర్ పై ఏదో గరిట తిప్పుతాడు అట ఏం తిప్పుతాడు ఆయన గారిటేనే దొంగ గారిటని ఎద్దేవా చేశారు.మరోవైపు ఇక్కడ ఉన్న నాయకులు సురేందర్ గురించి ఎదో ఇక్కడ ఉన్నవారు ఎదో మాట్లాడుతున్నారంట… వారు ఢిల్లీ కి వెళ్లి రూమ్ లలో కండువాలు కప్పుకున్నోళ్ళు బెదిరిస్తున్నారంట… సురేందర్ అమాయకుడు ఆయనకు మరిన్ని నిధులిచి ఆదుకుంటాం….ఎవరెంత మంది వచ్చి బెదిరించిన సురేందర్ కు నేను ఎంపీ బిబి పాటిల్ అండగా ఉంటామని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Minister Prashant Reddy’s visit to Gandhari zone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *