మణుగూరు నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
జిల్లాలోని మణుగూరు నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం విస్తృత పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మణుగూరు నియోజకవర్గం మొండికుంట గ్రామ పరిధిలో రూ.1.51 కోట్లతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రోడ్డు ఇరువైపుల సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.
ఆశ్వాపూరం ప్రధాన రహదారిపై రూ.4కోట్లతో రోడ్డుకు ఇరువైపుల సైడ్ డ్రైన్స్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

మణుగూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.2.50 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.మణుగూరు పట్టణ కేంద్రంలో సాయి దుర్గా రెస్టారెంట్ ను ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం మణుగూరు బుస్ డిపోను పరిశీలించారు. తక్షణమే డిపో ను ఆధునీకరించి, రూ.4 కోట్లతో నూతన బస్ స్టాండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హామి ఇచ్చారు.కార్యక్రమాలలో పువ్వాడ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.
Tags; Minister Puvwada’s extensive visit to Manuguru constituency
