Natyam ad

చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి రజనీ

గుంటూరు ముచ్చట్లు:


అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలన ఏ ముఖం పెట్టుకుని చేస్తున్నారంటూ మంత్రి విడదల రజిని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి విడదల రజిని చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లలని మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు.చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడని, ఇప్పటివరకు ముసుగులో ఉన్న వారిద్దరి బాగోతం తాజాగా ముసుగు తొలగడంతో బయటకు వచ్చిందని విడదల రజిని తెలిపారు. ఇక నేడు చంద్రబాబు పల్నాడు పర్యటన పైన కూడా విడదల రజనీ అసహనం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు పల్నాడు పర్యటన చేస్తారు అంటూ మండిపడ్డారు

 

Tags: Minister Rajni angry with Chandrababu

Post Midle
Post Midle