పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సోమవారం సాయంత్రం పట్టణంలో రోడ్డుషో నిర్వహించారు. దేశం ఇన్‌చార్జ్ చల్లాబాబు, నాయకులు వెంకటరమణరాజు, ఆర్‌విటి.బాబు, సివి.రెడ్డి, గిరి, మాధవరెడ్డి, సుబ్రమణ్యంరాజు, సద్ధామ్, సుహేల్ తో కలసి రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్థానిక గోకుల్ సర్కిల్‌లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ట్రావెలర్స్ బంగ్లాలో అధికారులతో, పార్టీ క్యాడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ యువకులు పట్టణంలో మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంత్రికి ఘన స్వాగతం పలికారు.
Tags: Minister Ramprasad Reddy Road Show in Punganur