చంద్రబాబు & కో పై మంత్రి రోజా ఫైర్

మచిలీపట్నం ముచ్చట్లు:


మంత్రి రోజా చంద్రబాబు, టీడీపీనేతలపై మండిపడ్డారు. జగన్ సుపరిపాలన చూసి ఓర్వలేత చంద్రబాబు అండ్ కో విషం కక్కుతోంది.తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పచ్చ ఛానల్స్ లో ప్రతికూలంగా చూపిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా అధికార దాహంతో సీఎం కుర్చీలో కూర్చోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నాడు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి త్యాగాలు చేయాలా..? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు. పవన్  కళ్యాణ్ ని, ఆయన అభిమానుల్ని చూస్తుంటే జాలేస్తోంది. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని పడగడతాడంట.. ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ కు సవాల్ విసిరితే బాగుంటుంది. చంద్రబాబు & కోకు పవర్ తప్ప ప్రజల అవసరం లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

 

Tags: Minister Roja Fire on Chandrababu & Co.

Leave A Reply

Your email address will not be published.