దేశమ్మవారికి తితిదే పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు

నగరి ముచ్చట్లు:


రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి  ఆర్.కె.రోజా,  సెల్వమణి దంపతులు నగరి పట్టణంలోని నగరి ప్రజల గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లి అమ్మవారికి ఆడినెల పూజ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు.తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున మొదటి సారిగా పట్టువస్త్రాలను మంత్రి రోజా సెల్వమణీ దంపతులు ఆలయ సమీపంలోని శ్రీ వినాయక స్వామి వారి ఆలయం నుంచి కాలినడకన తీసుకుని వెళ్ళి దేశమ్మ వారికి స్వయంగా సమర్పించారు.ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు వేదమంత్రాలతో దంపతులను ఆశీర్వదించారు. ఆర్.కె.రోజా సెల్వమణి దంపతులు దేశమ్మ అమ్మవారికి పొంగళ్ళుతో నైవేద్యం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Minister Roja Selvamani and the couple presented thithide silk clothes to Deshamma

Leave A Reply

Your email address will not be published.