వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. సింహ గిరి చేరుకున్న మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి త్రినాధ రావు స్వాగతం పలికారు. మంత్రి రోజా కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని , స్వామి వారి అంతరాలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమే సింహాచల దేవస్థానం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రసాదం స్కీం పవర్ పాయింట్ ను పరిశీలించారు. సింహాచల దేవస్థానం లో ప్రతిభక్తునికి ఉపయోగపడే విధం గా కాటేజీలు నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి చెందే విధంగా దేవస్థానం అభివృద్ధి చేస్తామని పెర్కొన్నారు.
Tags;

