ఆర్కె పురం లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సబితా

హైదరాబాద్ ముచ్చట్లు:

మహేశ్వరం నియోజకవర్గం ఆర్.కె.పురం లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. తరువాత  సిసి రోడ్లుకు శంకుస్థాపన చేసారు. మంత్రి మాట్లాడుతూ పేద,మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని మంత్రి అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రకటించడం అభినందనీయమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యవేక్షణలో  తెలంగాణ లో మొదటిసారి ఫీవర్ సర్వే  ప్రారంభిస్తే దేశం ఆదర్శంగా తీసుకుని ప్రతి రాష్ట్రంలో  ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె.పురం డివిజన్ అధ్యక్షుడు అరవింద్ శర్మ, బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Minister Sabita inaugurating an urban primary health center in RK Puram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *