చౌడాపూర్ మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్‌ ముచ్చట్లు:

 

జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఏర్పాటు అయిన నూతన చౌడాపూర్ మండలాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండల వనరుల కేంద్రం, అంగన్ వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ భవనం, వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాలను ప్రారంభించి చౌడా పూర్ మండల ప్రజలకు అంకితం చేశారు. చౌడాపూర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.అంతకు ముందు అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Minister Sabita Indrareddy inaugurated the Choudapur zone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *