బడంగ్ పేట్ లో ము గ్రంథాలయని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి ముచ్చట్లు:


4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంధాలయ నూతన భవ నాన్ని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి,తెలంగాణ గ్రంధాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో గ్రంథాలయము నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.పోటీపరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. దాతలు గ్రంథాలయాలకు సహకరించాలి అని తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. పెళ్లిరోజు,పుట్టినరోజు, శుభకార్యాల
సమయంలో కుటుంబ సభ్యులు గ్రంథాలయం లో పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని మంత్రి కోరారు. ఇప్పటికే పది లక్షల రూపాయలతో పుస్తకాలను కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీలు బోగ్గరపు దయానంద్,వాణి దేవి,రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాపాటి పాండురంగా రెడ్డి,మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Minister Sabita Indrareddy inaugurated the Mu Library in Badang Pet

Leave A Reply

Your email address will not be published.