హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు :
ఆర్.కె.పురం లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ పాలకవర్గ సభ్యులు నిర్వహించడం జరిగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా శ్రీ దుర్గా అమ్మవారికి బంగారు కిరీటం,  శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి  ఆభరణములు అందజేయడం జరిగింది. దేవాలయం అభివృద్ధికి పాటుపడుతున్న పాలకవర్గానికి,దాతలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి ఆంజనేయస్వామి ప్రజలను కాపాడాలని మంత్రి కోరుకున్నారు. ఉదయం నుండి స్వామివారికి వివిధ రకాల అర్చనలు కొనసాగుతున్నాయని పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Minister Sabita Indrareddy participating in Hanuman Jayanti celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *