ఆర్కె పురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా

హైదరాబాద్  ముచ్చట్లు:
మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్.కె.పురం డివిజన్ లొ   విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుమారు  2 కోట్ల వ్యయంతో  సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ డివిజన్లో ఉన్న సమస్యలను తీర్చడం జరుగుతుందన్నారు. సుమారు యాభై సంవత్సరాల వరకు ఉండే విధంగా సిసి రోడ్ల నిర్మాణం ఇతరత్రా పనులను చేపట్టడం జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.  కెసిఆర్ ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం,రేషన్ కార్డులను త్వరలో ప్రజలకు అందేటట్లు గా ఏర్పాట్లు చేయబోతున్నామని మంత్రి  అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్కెపురం డివిజన్ కార్పొరేటర్ రాధాధీరజ్ రెడ్డి,   ఆర్కెపురం డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్ శర్మ టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Minister Sabita laid the foundation stone for several development projects in RK Puram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *