Natyam ad

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యణోత్సవంలో పాల్గొన్న మంత్రి సబితా

రంగారెడ్డి ముచ్చట్లు:


రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామంలో వేంకటేశ్వర స్వామి గుట్టపైన  స్వయంభుగా వెలసిన ,శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయ14 వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా  నిర్వహించారు. కళ్యాణోత్సవంలో మంత్రి సబిలా ఇంద్రారెడ్డి పాల్గోన్నారు. ఈ ఉత్సవాలను చూసేందుకు చుట్టు పక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు స్వామి కళ్యణోత్సవానికి ఆంజనేయ స్వామి ఆలయం నుండి,

 

 

సర్వ భూపాల వాహనంపై ఊరేగించారు ఆలయ కమిటీ సభ్యులు.స్వామివారి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 18 న మొదలైన ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగాయి. భక్తులకు అన్నీ సదుపాయాలు సమకూర్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుని తరించాలని కోరారు.
మంత్రి తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నర్సింహ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి,అన్నదాత కార్యక్రమం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నర్సింహ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

 

Post Midle

Tags: Minister Sabita who participated in the marriage ceremony of Sri Venkateswara Swamy

Post Midle

Leave A Reply

Your email address will not be published.