బడంగ్ పేట్ లో మంత్రి సబిత పర్యటన

రంగారెడ్డి ముచ్చట్లు:
 
రంగారెడ్డి జిల్లా  మహేశ్వరంనియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 20,30వ డివిజన్లలో  నాలుగు కోట్ల 44 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడతూ మంచి నీటి పైప్ లైన్, డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్స్, స్మశాన వాటికల అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా స్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి అన్నారు.కాలనీలలో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడితే స్వాగతిస్తామని మంత్రి అన్నారు. ప్రజల కోసమే పని చేస్తాం కానీ పబ్లిసిటీ కోసం పని చెయ్యమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్,స్థానిక కార్పొరేటర్లు పెద్ద బావి సుదర్శన్ రెడ్డి,భీమిడి స్వప్న జంగారెడ్డి,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
 
దాడులను అరికట్టాలి
Tags: Minister Sabita’s visit to Badang Pet

Leave A Reply

Your email address will not be published.