ములుగు ఏరియా హాస్పిటల్ లో టి – డయాగ్నస్టిక్ సెంటర్‌ను   ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు ముచ్చట్లు:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానం తో  రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగం బలోపేతమవుతున్నదని . ఇది పేద ప్రజలకు వరంగా మారబోతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.బుధవారం రోజున  ములుగు ఏరియా హాస్పిటల్ లో  టి-డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడాతూ . రాష్ట్రంలో నేడు 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.  బడ్జెట్ లో  కేటాయించిన దానికి అదనంగా పది వేల కోట్ల రూపాయలను ఆరోగ్య రంగంలో ఖర్చు పెట్టడంతో వైద్య రంగం దశ మారనుందన్నారు. జిల్లాలో టి- డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించుకోడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్ లో 57 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్ కి  ప్రత్యేక ధన్యవాదాలు  తెలిపారు. రాష్ట్రంలో అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని ప్రమాదం జరిగినపుడు అత్యవసర సమయంలో మొదటి గంట సరైన వైద్యం అందించేందుకు చాలా ముఖ్యమైందని . ఆ సమయంలో వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతో సమయం వృథా అవుతుందని, హెల్త్ ప్రొఫైల్ ఉంటే సరైన సమయంలో సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు.  ఈ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడానికి సిరిసిల్లతో పాటు ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు ఈ జిల్లా ఇంచార్జి మంత్రిగా, గిరిజన బిడ్డగా సీఎం కృతజ్ఞతలని అన్నారు. త్వరలో గుండె సంబంధ అన్ని పరీక్షలు కూడా ఈ టి – డయాగ్నస్టిక్ సెంటర్ లో చేసుకునే అవకాశం వస్తుందన్నారు.  కరోనాను పూర్తిగా కట్టడి చేయడంలో అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, పీఓ హన్మంతు జేండగే డి ఎం అండ్  హెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఏఎస్పి   సాయి చైతన్య డాక్టర్ చందు నాయక్ ఎంపీపీ గండ్రకోట  శ్రీదేవి  తదితరులు ఉన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Minister Satyavathi Rathore inaugurated the T-Diagnostic Center at Mulugu Area Hospital
More about minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *