Natyam ad

మంత్రి సత్యవతి రాధోడ్ బైక్ ర్యాలీ

మునుగోడు ముచ్చట్లు:


మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ –  శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్  ఆధ్వర్యంలో పొర్లగడ్డ తండా, రాధానగర్ తండా, మరిబాయి తండా గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలు పార్టీ శ్రేణులతో భారీ బైక్  ర్యాలీ నిర్వహించారు. భారీ వర్షంలో మంత్రి సత్యవతి రాథోడ్ బైక్ ర్యాలీ కొనసాగింది. పొర్లగడ్డ తండా ఎంపీటీసీ పరిధి నుండి సంస్థాన్ నారాయణపురం మండలం వరకు ర్యాలీ కొనసాగింది.
బీజేపీకి మునుగోడు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని బైక్ ప్రచారంలో మంత్రి అన్నారు. మునుగోడు లో ఎగిరేది గులాబీ జెండానే. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇప్పుటికే టీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిందని.. భారీ మెజార్టీ దిశగా మాత్రమే కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.

 

Tags: Minister Satyavati Radhod bike rally

Post Midle
Post Midle