కోట్ల రూపాయల ఆశచూపిన కాంగ్రెస్ పార్టీ నుండి మారలేదు- మంత్రి సీతక్క

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

నేను చదువుకుంటున్న రోజుల్లో నక్సలైట్ అవుతానని అనుకోలేదు.విప్లవ ఉద్యమం నుంచి ఇవాళ ప్రజాసేవలో ఉన్నాను. పేదలను అసహ్యించుకునే వాళ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. పేదరిక నిర్మూలన జరిగితేనే నా లక్ష్యం నెరవేరినట్టు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పడింది. రాజకీయ నేతలు తప్పులు చేస్తే మేధావివర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలి. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తాలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నన్ను దెబ్బకొట్టాలని పదేపదే దుష్ప్రచారాలు చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు పంపించా రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి గోండులకు అవకాశం రాలేదు, ఎవ్వరూ మంత్రి కాలేదు. నాకు ఆ పదవి వస్తే బీఆర్ఎస్ వాళ్లు ఓర్వటం లేదు. నా ఉద్యమ జీవితాన్ని కూడా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినా నేను కాంగ్రెస్‌ను వీడలేదు” అని మంత్రి సీతక్క చెప్పారు.

 

 

Tags:Minister Sitakka has not changed from the Congress party that promised crores of rupees

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *