క్రీడాకారులకు అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ ముచ్చట్లు:


రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలోనుంచి  న్యూఢిల్లీ లో 17 వ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ తెలంగాణ జట్టు క్రీడాకారులు వివిధ విభాగాల్లో 4 – గోల్డ్ , సిల్వర్ – 1, బ్రాంజ్ – 2 పతకాలు సాధించిన సందర్భంగా క్రీడాకారులను, కోచ్ లను, అసోసియేషన్ నాయకులను  అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్  క్రీడల అభివృద్ధి కి విశేష కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి – పల్లె ప్రగతి కార్యక్రమంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 50 శాతం నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. మిగిలిన స్టేడియం ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. ఐస్ స్కెటింగ్ లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు అండర్  15 బాలికల విభాగంలో నైనా శ్రీ తాళ్లూరి, బాలుర విభాగంలో అండర్  10 వ విభాగంలో కీర్తి రాజ్ సింగ్, అండర్ 15 విభాగంలో ప్రాణవ్ మాధవ్ సూరపనేని, అండర్ 17 లో ధృవ్ ఆశిష్ , అండర్ 13 గొరిల్ల గితీక, తదితరులు పతకాలు సాధించారు.

 

Tags: Minister Srinivas Gowda congratulated the players

Post Midle
Post Midle
Natyam ad