హరేకృష్ణ కిచెన్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
 
మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరులో  హరేకృష్ణ మూవ్మెంట్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సౌజన్యం తో నూతనంగా 20 వేల సామర్థ్యంతో నిర్మించిన ఆధునిక కిచెన్ ను  మంత్రి శ్రీనివాస్ గౌడ్
శనివారం ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2014 సమయంలో బడుల్లో దయనీయ స్థితి వుండేది. హాస్టల్ వెళ్ళాలంటే పిల్లలు ఏడ్చే పరిస్థితి.. ఎవరినైనా తిన్నావా అంటే లేదు అనే
సమాధానం వచ్చేది. తర్వాతి కాలంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంచి నీళ్లు.. మధ్యాహ్న భోజనం లాంటి వసతులు వచ్చాయి. ఇదే కాకుండా హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు భోజనం పథకాన్ని పెట్టారని
తెలిసి.. ఇలాంటి వసతి మా నియోజక వర్గంలో అన్ని బడుల్లో ఉండాలని దీన్ని ఏర్పాటు చేయించాలని భావించాం. ఇది ఏర్పాటు చేసిన హరే కృష్ణ ఫౌండేషన్ వారికి పాదాభవందనాలని అన్నారు. ఈరోజు ఈ
కిచెన్ నుంచి మధ్యాహ్న భోజనం తో పాటు.. 20 వేల మంది విద్యార్థులకు అల్పాహార వసతి కలుగుతుంది. మీ ఆశీర్వాదం తెలంగాణా వ్యాప్తంగా ఉండాలని కోరుకుంటున్నాం.  వీరు చేస్తున్న సాయానికి..
ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలి.  ఇప్పటి దాకా అన్ని పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రజలను వాడుకున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అధికారం చేశారు. హరే
కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఇంకా ఏ కార్యక్రమం చేసినా మా అన్ని విధాలుగా సహాయ.. సహకారాలు ఉంటాయని అన్నారు.
 
Tags:Minister Srinivas Gowda inaugurated the Harekrishna Kitchen

Leave A Reply

Your email address will not be published.