కడప జైలును సందర్శించిన మంత్రి సుచరిత

Date;28/02/2020

కడప జైలును సందర్శించిన మంత్రి సుచరిత

కడప ముచ్చట్లు:

రాష్ట్రంలోని ఖైదీలంతా ఉపాధి పోందే విధంగా కారాగారాల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలు నెలకొల్పుతున్నాం. క్షణికావేశంలో ఉన్న వారిలో మానసిక పరివర్తన పోందే విధంగా ప్రణాళికలు  రూపోందిస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం నాడు అమె జిల్లాలోని కేంద్ర కారాగారాన్ని  సందర్శించారు. తరువాత ఆమె  జిల్లా పోలీసుల సేవా కార్యక్రమాల  పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ మహిళా భద్రత కోసం  రాష్ట్ర వ్యాప్తంగా దిశా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేస్తున్నాం. దిశా చట్టంలో భాగంగా విశాఖలో పోరెనిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.   ఖైదీలను సోదరా భావంతో చూడాలి. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల కు చర్యలు తీసుకుంటామని అన్నారు.
చంద్రబాబు ను ఎవరూ అరెస్ట్ చేయలేదు. రాజకీయం చేసేందుకే విశాఖలో అయన పర్యటించారు. చంద్రబాబు పర్యటనను ప్రజలే అడ్డుకున్నారు. శాంతి భద్రతల కారణంగానే బాబును వెనక్కి  పంపాల్సి వచ్చింది. పార్టీ పరంగా అక్కడికెళ్ళారు. అప్పట్లో మెచ్చుకున్న పోలీసులే రాష్ట్రంలో ఉన్నదని అన్నారు.

Tags;  Minister Sucharitha who visited Kadapa Prison

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *