నిడగల్లు లో మంత్రి సుజయ్ కృష్ణ పర్యటన

Minister Sujai Krishna tour in Nidagalu

Minister Sujai Krishna tour in Nidagalu

Date:09/11/2018
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో పశు వైద్యశాల ను  రాష్ట్ర గనుల శాఖ మంత్రి ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు. తరువాత  స్థానిక  పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు,  ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తో కలిసి గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు రైతులకు ప్రోత్సాహం కల్పిస్తుందని పశువుల పెంపకం పథకం కింద గోకులం పథకం ద్వారా అధిక మొత్తంలో సబ్సిడీ రుణాలు మంజూరు చేసి పశువుల పెంపకంలో పాడి రైతులకు  ఒక మంచి భరోసా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల్పిస్తున్నారని ఆయన అన్నారు.  నిడగల్లు గ్రామంలో సందర్శిస్తూ సంక్షేమ పథకాల అమలుపై గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి నాయకులు,   అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: Minister Sujai Krishna tour in Nidagalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *