Natyam ad

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సురేష్

విశాఖపట్నం ముచ్చట్లు:


ఉత్తరాంధ్రలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారిస్తు న్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.సీహారియర్ మ్యూజియంను సందర్శించి..వీఎంఆర్డీఏ అధికారులకు పలు సూచన లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మీడియా తో మాట్లాడారు. భోగాపురం అంతర్జా తీయ విమానా శ్రయానికి ఇటీవలే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశార ని.. ఎయిర్పోర్టుకు కనెక్టివిటీలో భాగంగా విశాఖ నుంచి ఆరులైన్ల రహదారి నిర్మాణానికి సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.6,500 కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టుకు సంబం ధించిన డీపీఆర్ రూపకల్పనకు ప్రాథమికంగా అనుమ తులు లభించాయని చెప్పారు.త్వర లో నే తదుపరి కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు.మంత్రి గుడి వాడ అమర్నాథ్ మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి సీఎం విశాఖలోనే ఉంటారని పునరుద్ఘాటించారు. రాబో యే కొద్ది నెలల్లో విశాఖలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమా లకు శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు.

 

 

అనంతరం మంత్రి సురేష్ ఎంవీపీకాలనీలో నిర్మిం చిన స్పోర్ట్స్ ఏరీనాను సందర్శించారు. ఇక్కడ చేసిన ఏర్పాట్లతో పాటు ప్రాజెక్ట్ వివరాలను జీవీఎంసీ కమిషనర్, అధి కారులను అడిగి తెలుసుకున్నా రు. ఎంవీపీకాలనీలో రూ.26 కోట్లతో నిర్మించిన అధునాతన స్పోర్ట్స్ కాంప్లె క్స్ సీఎం ప్రారంభించిన అనంతరం అందుబాటులోకి వస్తుందన్నారు.సీఎం ప్రారంభించనున్న ప్రాజెక్టుల శిలా ఫల కాలపై చంద్రబాబు, కొందరు టీడీపీ నాయకుల పేర్లు వేయాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి చేసిన అభ్యర్థన అర్థరహితమని మంత్రి సురేష్ అన్నా రు. ఈ ప్రాజెక్టులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పూర్తిస్థా యిలో నిధులు కేటాయించి, త్వరితగ తిన పనులు పూర్తి చేసి, అందుబా టులోకి తీసుకొస్తున్నట్లు వివరిం చారు.

 

Post Midle

Tags; Minister Suresh inspected the CM’s visit arrangements

Post Midle