Date:21/01/2021
హైదరాబాద్ ముచ్చట్లు:
తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పదవి నుండి తక్షణం తొలగించాలని తెలంగాణ గంగపుత్ర ఐకాస నేతలు డిమాండ్ చేసారు. గురువారం వారంతా మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని హైదరాబాద్ కోకాపేట్ లో ముదిరాజ్ మహాసభలో గంగపుత్రుల హక్కులను హరించే విధంగా వాఖ్యలు చేశారు. అందుకు గంగపుత్రులకు మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. గంగపుత్రులను అవమానపరుస్తూ.. ముదిరాజ్ లను నెత్తిన పెట్టుకోవడం సమంజసం కాదని వారన్నారు. మంత్రి వాఖ్యలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులకు, ముదిరాజ్ లకు మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయి. తలసానికి మత్స్య శాఖ పై అవగాహన లేదు. జనవరి 26 తేదీ లోపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. లేనిపక్షంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 26న గంగపుత్రుల ఆత్మగౌరవ మిలియన్ మార్చ్ చేపడతామని తెలంగాణ గంగపుత్ర ( బెస్త ) జేఏసీ అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు.
పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన
Tags: Minister Talasani should be removed