బాలుడికి అండగా నిలిచిన మంత్రి తలసాని.

హైదరాబాద్ ముచ్చట్లు:
అసలే పేదరికం…ఆపైన అతి చిన్న వయసు కలిగిన తమ కుమారుడికి వచ్చిన వ్యాధి గురించి వైద్యులు చెప్పిన విషయం ఆ కుటుంబ సభ్యులను షాక్ కు గురి చేసింది. అలాంటి కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
వివరాలలోకి వెళితే  చంపా పేట్ కు చెందిన జంగయ్య, యశోద దంపతుల కుమారుడు శివతేజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో శివతేజ్ ను నిమ్స్ వైద్యుల వద్దకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ గా గుర్తించారు. చికిత్స కోసం 5 లక్షల రూపాయల వరకు అవుతుందని, వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశ్రయించి తమ ఇబ్బందిని వివరించారు. తక్షణమే స్పందించిన మంత్రి      శ్రీనివాస్ యాదవ్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2.50 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరైనది. ఈరోజు వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం లో బాలుడి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం మంజూరు పత్రం (LOC)ని మంత్రి అందజేశారు.
 
Tags;Minister Talasani stood by the boy