Natyam ad

సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్  ముచ్చట్లు:

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పను అంజి, , లు సకాలంలో పూర్తయ్యే విధంగా పర్యవేక్షించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో, వాటర్ వర్క్స్, , ఎలెక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ తదితర శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, వాటర్ వర్క్ MD దాన కిషోర్, కమిషనర్ లోకేష్ కుమార్, రఘుమారెడ్డి, జియా ఉద్దిన్ లు పాల్గొన్నారు.

 

 

 

Post Midle

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో అనేక ప్రధాన, అంతర్గాట్ రోడ్లను అభివృద్ధి చేసి వాహనదారుల ఇబ్బందులను తొలగించడం జరిగిందని తెలిపారు. సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతం నుండి బాల నగర్ చౌరస్తా వరకు అండర్ పాస్ నిర్మాణం, ఫతే నగర్ ప్లై ఓవర్ విస్తరణ పనుల కోసం HMDA నుండి 100 కోట్ల రూపాయల ను మంజూరు చేసినందుకు మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ పనులను చేపట్టడానికి స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫతే నగర్ ఫ్లై ఓవర్ విస్తరణ, క్రింద స్థల సేకరణ చేపట్టి రోడ్డు విస్తరణ చేయడం వలన ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య భారీగా తగ్గుతుందని వివరించారు.

 

 

అదేవిధంగా రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి విస్తరణ పనులను కూడా త్వరితగతిన చేపట్టే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్ పాన్ బజార్ లో మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. సనత్ నగర్ లోని KLN పార్క్ అభివృద్ధి పనుల కోసం 2.41 కోట్ల రూపాయలు మంజూరైనాయని, పార్క్ లోని లేక్ ను అభివృద్ధి చేయడం, మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు, వాకింగ్ ట్రాక్ ల నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు వంటి పనులను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవన్నీ చేపట్టేందుకు అదనంగా మరో 2.50 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, CSR నిధులతో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను మంత్రి ఆదేశించారు. సనత్ నగర్ లో అత్యధికంగా 55 పార్క్ లు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు గాను వచ్చే హరితహారం కార్యక్రమానికి ఇప్పటి నుండే ప్రతిపాదనలను సిద్దం చేయాలని ఆదేశించారు.

 

 

అదేవిధంగా BK గూడ పార్క్ కు వచ్చే వారికోసం టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శిధిలావస్థకు చేరుకున్న BK గూడ వార్డ్ ఆఫీస్ స్థానంలో నూతన భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల త్రవ్వకాలు జరిపే సమయంలో డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ లు ద్వంసమై ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలా జరగకుండా వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనులు చేపట్టాలని చెప్పారు. బేగంపేట, పికెట్ నాలా అభివృద్ధి పనులను వర్షాకాలం లోగా పూర్తి చేసే విధంగా పనులను మరింత వేగవంతం చేయాలని, తద్వారా వచ్చే వర్షాకాలంలో వరదముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల నీటి అవసరాలను తీర్చడం కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బోర్ వెల్స్ మరమ్మతులు వచ్చినప్పుడు సకాలంలో చేయకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయని, పిర్యాదులు వచ్చిన వెంటనే మరమ్మతులు జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అల్లా ఉద్దిన్ కోటి లో ప్రమాదకరంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ లైన్ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ లైన్ ను తొలగించి అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల విద్యుత్ వైర్లు క్రిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని తొలగించి బంచ్ కేబుల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఇనుప స్థంబాల తో వర్షాకాలంలో విద్యుత్ షాక్ కు గురవుతున్నారని, వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలకు బిల్లులు చెల్లించాలనే కారణంతో విద్యుత్ సరఫరా నిలిపివేయవద్దని స్పష్టం చేశారు. అదేవిధంగా కాలనీలు, బస్తీలలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లకు పెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

 

సమ్మర్ ప్రారంభమైనందున అమీర్ పేట లోని DK రోడ్డులో గల స్విమ్మింగ్ పూల్, సికింద్రాబాద్ లోని గురుమూర్తి స్విమ్మింగ్ పూల్ లను అవసరమైన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రేవ్ యార్డ్ ను ఎంతో అద్భుతంగ అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజులలో గ్రేవ్ యార్డ్ ను సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ లు రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, DC లు మోహన్ రెడ్డి, ముకుంద రెడ్డి, EE లు ఇందిర, ఎలెక్ట్రికల్ DE శ్రీధర్, సుదర్శన్, వాటర్ వర్క్స్ GM లు హరి శంకర్, రమణారెడ్డి, హార్టికల్చర్ DD శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags;Minister Talasani’s review of Sanat Nagar constituency development works

Post Midle