Minister Talasani's visit to Achchampeta

అచ్చంపేటలో మంత్రి తలసాని పర్యటన

Date:20/11/2019

నాగర్ కర్నూలు ముచ్చట్లు:

నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ,పశు సంవర్థక పాడిమత్స్య,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.  లబ్దిదారులకు పాడి గేదెలు, గొర్రెలు, పంపిణీ చేశారు. , అలాగే యాదవ కమ్యూనిటీ భవనం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. తరువాత   సదర్ పండుగ ఉత్సవాలు ప్రారంభించారు. మంత్రి  మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడలేనివిదంగా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన అవి మాకు దీవెనలు ఇస్తున్నాయని, వివిధ పథకాల అమలులో చిన్న చిన్న  ఇబ్బందులు ఉండడం సహజమే అని అంత మాత్రాన ప్రజలకు అందటంలేదు అనేది అవాస్తవమని అన్నారు.  అన్ని పథకాలు పక్కాగా ప్రజలకు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా జెడ్పి చైర్మన్ పద్మావతి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, నియోజకవర్గ జడ్పీటీసీ లు,ఎంపీటీసీలు, ఎంపీపీలు  సర్పంచులు, అధికారులు, యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు.

 

జిల్లా వ్యాప్తంగా డిజిటల్ గ్రంధాలయాలు

 

Tags:Minister Talasani’s visit to Achchampeta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *