అంబర్ పేటలో మంత్రి తలసాని పర్యటన

హైదరాబాద్  ముచ్చట్లు:
హైదరాబాద్ మహానగర అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పశుసంవర్ధక మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ అంబర్ పేట్ లో పట్టణ ప్రగతి  కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్  అధికారులతో కలిసి జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. తరువాత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ అంబర్పేట్ లో ఉన్న అతి పెద్ద నాలా సమస్య  పరిష్కారానికి 39 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ సమస్య నుండి బయట పడవచ్చని, అంటువ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతతో పాటు పచ్చని వాతావరణాన్ని కల్పించడానికి హరితహారం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ప్రాంతం నుండి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన వారు నియోజకవర్గం నుండి పారిపోయారని ఎద్దేవా చేశారు. అంబర్పేట్ మోయిన్ చెరువు, వివిధ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Minister Talasani’s visit to Amber Peta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *