డిపిఆర్ లను సిద్దం చేయాలన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
– వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు
అమరావతి ముచ్చట్లు:
చిత్తూరుజిల్లా సదుంలో ఏర్పాటు చేస్తున్న వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో వ్యవసాయ, పశుసంవర్థకశాఖ, వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలేజీకి అవసరమైన తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పుంగనూరులోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనాల నిర్మాణంకు టెండర్లు పిలవాలని, విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లపై డిపిఆర్ లను సిద్దం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్థకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.మధుసూదన్ రెడ్డి, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

Tags: Minister to prepare DPRs Peddireddy Ramachandra Reddy
