దేవేంద్రాచారి మృతికి మంత్రి నివాళి

Minister tribute to Devendrachari's death

Minister tribute to Devendrachari's death

Date:12/08/2018

పలమనేరు ముచ్చట్లు:

పట్టణ పరిధిలోని గుండుభావి ప్రాంతానికి చెందిన దేవేంద్రాచారి అనారోగ్యంతో ఉండగా ఓ పిఎంపి వైద్యుని వైద్యం వికటించి మృతిచెందారు. అలాగే 24 వ వార్డులోని కాకాతోపు ప్రాంతానికి చెందిన సుశీలమ్మ గత కొంత కాలంగా గుండెపోటుతో భాదపడుతూ ఆదివారం కన్ను మూసారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి మృతుల నివాస ప్రాంతాలకు వెళ్ళి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భాదిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు సుధాకర్, నాయకులు శ్యామ్ కుమార్, లోకేష్ ఆచారి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులోఆగస్టు 15 నుంచి జనగణమన ఇక నిరంతరం

Tags:Minister tribute to Devendrachari’s death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *