విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి ఉషశ్రీ
విశాఖపట్నం ముచ్చట్లు:
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చేపట్టిన చాతుర్మాస్య దీక్ష ఫలితం రాష్ట్రానికి ఉండాలని కోరుకున్నానని అన్నారు. పీఠాన్ని సందర్శించిన అనంతరం మంత్రి శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరి వెళ్ళారు.
Tags: Minister Ushasree visited Visakha Sarada Peetha