వాడపల్లి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా మంత్రి వెల్లంపల్లి

రాజమండ్రి ముచ్చట్లు:
 
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరు పతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తన సహాయ సహకారా లు అందజేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.కొత్తపేట నియోజక వర్గంలో పర్యటన భాగంగా ఆయన ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యు లు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించు కున్నారు.ఈసందర్భంగా ఆయనకు  ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆలయ కార్యనిర్వహణా ధికారి యమ్ సత్యనారాయణ రాజు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సుమారు 8కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరు పతి వెంకటేశ్వర స్వామి ఆలయం తరువాత అంద అభివృద్ధి జరుగుతు న్న ఆలయం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అని వాడపల్లి అభి వృద్ధికి తమ శాఖ ద్వారా సహాయ సహకారాలు అందజేస్ధానని తెలిపా రు.అనంతరం స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Minister Vellampally will provide assistance for the development of Vadapalli

Natyam ad