బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో పాల్గోన్న మంత్రి వేముల
బాల్కోండ ముచ్చట్లు:
బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గోన్నారు. ప్రతినిధుల సభలో పాల్గొనే ముందు బాల్కొండ నియోజకవర్గ మండలాల వారిగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల పేర్లు నమోదు,సభ,పార్టీకి సంబంధించిన కిట్ లు అందజేసే స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. వేల్పూర్ మండల స్టాల్ లో తన పేరు నమోదు చేసుకుని ప్రతినిధుల సభ ఐడి కార్డు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు. బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి,తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరులకు నివాళిగా సభ గా 2నిమిషాలు మౌనం పాటించింది. సభా ప్రాంగణమంతా కలియతిరుగుతూ బిఆర్ఎస్ శ్రేణులను మంత్రి ఆత్మీయంగా పలకరించారు.
Tags; Minister Vemula participated in the meeting of representatives of BRS

