ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి వేముల
బాల్కోండ ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉదృతంగా ప్రవహించి పంట ముంపుకు గురయిన ప్రాంతాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. గ్రామస్థులు,రైతులతో మాట్లాడారు.పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక వరదల నేపథ్యంలో పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడాన్ని పరిశీలించారు.అధికారులకు పలు సూచనలు చేశారు.బాధిత రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సెంట్రల్ కమిటి అధికారులు ప్రభావిత ప్రాంతాలని పరిశీలించిన సంగతి తెలిసిందే.
Tags: Minister Vemula visited flooded areas

