Natyam ad

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

నిలిచిపోయిన దళిత బంధు

 

ఖమ్మం ముచ్చట్లు:

 

అధికార, ప్రతిపక్ష పార్టీల పంతాల మూలంగా భద్రాచలంలో దళితబంధు పథకానికి గ్రహణం పట్టింది. లబ్ధిదారుల ఫైనల్ లిస్టు విషయంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కి నడుమ పంచాయతీ తెగడం లేదని తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఎంపిక జాప్యమవుతోంది. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకున్నా సమస్య ఓ కొలిక్కిరాలేదని సమాచారం. మూడు మండలాల్లో ఎంపిక చేయాల్సిన 60 మందిలో చెరిసగం అనే అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదనకి ఎమ్మెల్యే వీరయ్య ఒప్పుకోకపోవడంతో భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో దళితబంధు స్కీమ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇలా దళితబంధుకి గ్రహణం పట్టిన ఫలితంగా లబ్ధిదారుల ఎంపిక(ఫైనల్ లిస్టు), యూనిట్ల పంపిణీ ప్రక్రియ ఒక్క అడుగు ముందుకు పడటంలేదు. దీంతో లిస్టులో పేర్లున్న లబ్ధిదారులు యూనిట్ల పంపిణీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇతర జిల్లాల్లో దళితబంధు యూనిట్ల పంపిణీ జరుగుతున్నా భద్రాచలంలో మోక్షమెన్నడో అని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దళితబంధు యూనిట్లు గ్రౌండ్ చేయాలని కోరుతూ భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లోని 60 మంది లబ్ధిదారులు సోమవారం కొత్తగూడెం వెళ్ళి ప్రజాదర్బార్‌లో జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారురాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో ఒక్కో నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు చేసింది. స్థానిక శాసనసభ్యుల సిఫార్స్ మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ప్రకటించింది. ఆ మేరకు ఎమ్మెల్యే పొదెం వీరయ్య రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, సూచనలు అనుసరించి భద్రాచలం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒక్కో మండలానికి ఇరవై మంది లబ్ధిదారుల లిస్టును ప్రభుత్వానికి సిఫార్స్ చేశారు. ఆ ప్రకారం భద్రాచలం నియోజకవర్గం పరిధిలో ఉన్న ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి ఎమ్మెల్యే ద్వారా అందిన 40 మంది లిస్టుకి ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యవతి రాథోడ్ ఆమోదం తెలపడంతో ఏ ఆటంకం లేకుండా అక్కడ ఇటీవల దళితబంధు యూనిట్ల పంపిణీ అధికారులు,

 

 

Post Midle

ప్రజాప్రతినిధుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. కానీ, ఇదే భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో మాత్రం దళితబంధు పంపిణీకి మోక్షం కలగడంలేదు. ఎమ్మెల్యే వీరయ్య ఇక్కడ 60 మంది పేర్లతో సిఫార్స్ చేసినప్పటికీ ఇంకా ఆ లిస్టుని జిల్లా కలెక్టర్ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. మంత్రి అడ్డుపడిన కారణంగానే ఆగినట్లుగా సమాచారం. ఎమ్మెల్యే తన లిస్టు సవరించుకొని మండలానికి 10 మంది చొప్పున 30 మంది పేర్లు ఇస్తే మిగిలిన 30 టీఆర్ఎస్ నాయకులు సూచించిన వారికి ఇవ్వాలనే ఆలోచనతోనే మంత్రి పువ్వాడ అధికారులతో చెప్పి ఫైనల్ లిస్టు ఆపినట్లుగా ప్రచారం జరుగుతోంది.అయితే, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఇలాగే చేస్తే తను కూడా అదే పద్ధతి అనుసరిస్తానని ఎమ్మెల్యే వీరయ్య చెబుతున్నారు. నిబంధనల ప్రకారం తను సిఫార్స్ చేసిన 60 మందికి ఇస్తే దళితబంధు ఇవ్వండి. లేదంటే తన ప్రమేయం లేకుండా అధికార పార్టీకి నచ్చినవారికే ఇచ్చుకోండని ఎమ్మెల్యే వీరయ్య చెబుతున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని వీరయ్య అన్నారు.గ్రూపు గొడవల మూలంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులకు ఇపుడు లోకల్ ఎమ్మెల్యే లేని లోటు తెలిసివస్తోంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి, మంత్రులు, ఎంపీలు ఉన్నప్పటికీ దళితబంధు విషయంలో లోకల్ ఎమ్మెల్యేని కాదని ఏమీ చేయలేని పరిస్థితి.‌ దళితబంధు లిస్టులో సగం వాటా కోసం భద్రాచలం ఎమ్మెల్యేని ఒప్పించడానికి పాట్లుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

Tags: Minister vs. MLA

Post Midle