హైలెవెల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన మంత్రి వేముల

Date:28/10/2020

హుజూర్ నగర్  ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం మట్టపల్లి వద్ద కృష్ణా నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ను  రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు హజరయ్యారు.  ఈ వంతెన నిర్మాణం ద్వారా కోదాడ,హుజూర్ నగర్ ప్రజలకు 30 కి.మీ దూరం తగ్గుతుంది. కోదాడ-హుజూర్ నగర్-మట్టపల్లి-దాచన్ పల్లి మీదుగా గుంటూరు రోడ్డు ను ఈ మట్టపల్లి బ్రిడ్జ్ కలుపుతుంది.ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావాలనేది ఈ రెండు నియోజకవర్గాల ప్రజల చిరకాల కోరిక. హుజూర్ నగర్, మట్టపల్లి, మేల్లచెరువు,చింతలపాలెం, నేరడిచెర్ల, కోదాడ, చిలుకూరు, అనంతగిరి, నడిగుడం, మునగాల,మోతె మండలాల రైతులకు రవాణా సౌలభ్యం కలగనుంది.

కాంగ్రెస్ నేతపై దాడికి యత్నం

Tags: Minister Wemula inaugurating the Highlevel Bridge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *