బీహార్ ఎన్నికలు త‌ర్వాత‌ మంత్రి వర్గ విస్తరణ

Date:17/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గ విస్తరణకు రెడీ అవుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చేర్పులు, తొలగింపులు కూడా ఉంటాయంటున్నారు. ఇటీవల రామ్ విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆయన నిర్వహిస్తున్న శాఖలను పియూష్ గోయల్ కు అప్పగించడంతో మంత్రి వర్గ విస్తరణపై ప్రచారం మరింత ఊపందుకుంది.నిజానికి మంత్రి వర్గ విస్తరణను మోదీ ఎప్పుడో చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ సమయంలో మంత్రి వర్గ విస్తరణ సాధ్యం కాలేదు. మధ్యప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలతో అక్కడి కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రిపదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చుకోవాల్సి ఉంది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఫలితాలను బట్టి జ్యోతిరాదిత్య సింధియా కు ఎలాంటి పదవి ఇస్తారన్నది ఆధారపడి ఉంటుందంటున్నారు.ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు తమ శాఖలతో పాటు అదనపు శాఖలను కూడా పర్యవేక్షిస్తున్నారు.

 

 

ఇది వారికి భారంగా మారింది. అందుకే త్వరితగతిన మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. బీహార్ ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీతో పూర్తవుతుంది. పియోష్ గోయల్ వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖలను చూస్తున్నారు. ఇప్పుడు పాశ్వాన్ శాఖలను కూడా అప్పగించారు. దీంతో సురేష్ ప్రభును మంత్రివర్గంలోకి తీసుకుని రైల్వే శాఖను అప్పగించాలన్న యోచన కూడా మోదీ చేస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించిన రామ్ మాధవ్, మురళీధరరావులకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశముందన్న వార్తలు హస్తినలో విన్పిస్తున్నాయి. ఈసారి విస్తరణలో బీజేపీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ఇక గత పదిహేడు నెలలుగా పనితీరు సరిగా లేని కొందరు మంత్రులను కూడా మోదీ మంత్రి వర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. మొత్తం మీద బీహార్ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణపై మోదీ, అమిత్ షా కసరత్తులు చేస్తున్నారని

ఎన్డీయేలో చిన్నా, చిత‌క పార్టీలే

Tags: Ministerial expansion after the Bihar elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *