స్పీకర్ కు మంత్రిపదవి…  ?

Date:15/07/2020

విజయవాడ ముచ్చట్లు:

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నారు. ఈ నెల 22వ తేదీన మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమయింది. అయితే మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరికే అవకాశం ఉండనుంది. శాఖల మార్పు జరగొచ్చు కాని ఇద్దరికి మించి మంత్రివర్గంలోకి జగన్ తీసుకోరన్నది విశ్వసనీయ సమాచారం. దీంతో మంత్రి పదవులపై అనేక ఆశలు పెట్టుకున్నారు. రోజుకు కొన్ని పేర్లు అమరావతి కేంద్రంగా విన్పిస్తున్నాయి. జగన్ వద్దకు నేరుగా వెళ్లే అవకాశం లేకపోవడంతో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను ఆశావహులు కలుస్తున్నారు.పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఆ స్థానాలను జగన్ భర్తీ చేయనున్నారు. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారికి, అదే సామాజిక వర్గానికి ఈ రెండు పదవులు ఇస్తారని పార్టీలో నిన్న మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. కేబినెట్ లోకి పొన్నాడ సతీష్, జోగి రమేష్ లను జగన్ తీసుకుంటున్నారని కూడా భారీ ‍‍ఎత్తున టాక్ నడిచింది. కొందరు వీరిద్దరికి ముందుగానే కంగ్రాట్స్ కూడా చెప్పారు.

 

 

 

 

అయితే జగన్ మనసులో మాత్రం సామాజికవర్గాలు, ప్రాంతాలకు కాకుండా మరొకరికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కొత్త సమీకరణాలు చోటు చేసుకున్నాయంటున్నారు. అదే సామాజికవర్గానికి, ప్రాంతానికి ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. అందుకోసమే కొత్తగా మంత్రి పదవుల జాబితాలోకి ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం, ముత్యాల నాయుడు పేర్లు బయటకు వచ్చాయి.స్పీకర్ గా తమ్మినేని సీతారాం సంతృప్తికరంగా లేరు. ఆయన ఎన్నాళ్ల నుంచో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, స్పీకర్ గా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘపతిని చేస్తారంటున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఈ పదవితో అవకాశమిచ్చి నట్లవుతుందని జగన్ భావిస్తున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి మంత్రి పదవి లేక పోవడంతో స్పీకర్ పదవితో భర్తీ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణపై రోజుకో ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పదవులు రెండూ బీసీ సామాజికవర్గానికే ఇవ్వడం మాత్రం ఖచ్చితమని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ధర్మాన కొత్త ఆయుధం

Tags:Ministerial post for Speaker …?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *