మంత్రి పర్యటన ఆశా వర్కర్లకు పనిష్మెంట్

నారాయణపేట ముచ్చట్లు:

 

నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా  స్వాగతం  పలికేందుకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థ లోని  శాఖలలో పనిచేసే మహిళలనుఅధికారులు పిలిపించారు.  ఇలాగైనా మంత్రి కేటీఆర్ మన్ననలు పొందాలని వేల సంఖ్యలో  వచ్చిన ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు  ఇబ్బందులపాలయ్యారు. అధికారులు. ఉదయం 6 గంటలకు రోడ్డుకిరువైపులా ఒక మొక్కను చేతికిచ్చి డ్రెస్ కోడ్ తో అంగన్వాడి ఆశా కార్యకర్తలతో పాటు మున్సిపాలిటీ  కార్మికులను నిలబెట్టారు.  తాగడానికి మంచినీళ్లు కూడా ఇచ్చేనాధుడు కరవై పోయారు.   దాదాపు నాలుగు గంటలపాటు రోడ్డుపైనే మొక్కల ను  పట్టుకొని  నిలబెట్టి ఉంచారు. కానీ వీరి కడుపు నింపడం మాత్రం మర్చిపోయారు. కేటీఆర్ తన కార్యక్రమాన్ని చూసుకొని మరో ప్రాంతానికి వెళ్లిపోగా ఇక మీ పని అయిపోయింది ఇంక వెళ్లిపోండి అని సింపుల్ గా హుకుం జారీ చేశారు అదికారులు. ఆవేదనతో బాధతో తిరుగుముఖం పట్టారు ఈ కార్యకర్తలు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

 

Tags: Ministerial visit Punishment for Asha workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *