Ministerial visit to flood prone areas

 ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

Date:14/07/2020

ఏలూరు ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఎస్ ఇల్లింద్ర పర్రు, జుత్తిగా, పొలమూరు, మల్లిపూడి తదితర గ్రామాల్లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గురైన ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల పెనుమంట్ర మండలం లో గోస్తనీనది వెంబడి ఉన్న గ్రామాల్లోనే ఎక్కువగా నారుమడులు మునిగిపోయి దెబ్బతిన్నాయన్నారు. వారం రోజులుగా వర్షాలు ఎక్కువగా కురవడంతో నారు మడులు నీటమునిగాయని అన్నారు. వ్యవసాయ అధికారులు మరియు సిబ్బంది నీటమునిగిన నారుమడులను పరిశీలించి వెంటనే సమగ్ర సర్వే అందజేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. గోస్తనీలో గత 28 ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో మేటలు వేసి తూడు బాగా పెరిగిపోవడంతో భారీ వర్షాల సమయంలో ఇబ్బంది పడుతున్న రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి రంగనాథ రాజు  దృష్టికి తీసుకొచ్చారు. గోస్తనీ నది ప్రక్షాళన చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి రంగనాథ రాజు హామీ ఇచ్చారు.

ఆందోళన బాట పడుతున్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది

Tags:Ministerial visit to flood prone areas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *