ఎన్నికల ప్రచారంలో  మంత్రుల బిజీ బిజీ

Date:18/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
నిన్నమొన్నటి దాకా పాలనలో బిజీగా ఉన్న తెలంగాణ మంత్రులు.. ముందస్తు ఎన్నికల ప్రచారంలో హడావుడిగా ఉన్నారు. పాలనను పక్కన బెట్టి.. గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మంత్రులంతా నియోజక వర్గాలు చుట్టేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి వారి ఇలాకాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది.  బాట పట్టారు. సభలు సమావేశాలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. అత్యధికులైన మంత్రులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముందున్నారు.
హరీష్‌రావు , ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు గౌడ్, జోగు రామన్న, జగదీశ్వర్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి తదితరులు ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. మంత్రుల నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలు,  ప్రచార రథాలపై పర్యటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియచేస్తూ ఓటర్ల మద్దతు కోరుతు న్నారు.
ప్రచారంలో ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి కూడా ముందంజలో ఉన్నారు. గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. విపక్షాలపై సున్నితమైన విమర్శలతో  ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఏక గ్రీవ తీర్మానాలు చేస్తున్నారు.  ఈ ఇంటి ఓట్లు మంత్రి ఈటెల రాజేందర్‌కే వేస్తాం.
ఇతరులు మా ఓట్లు అడగడానికి రావద్దండి అని కొందరు తమ ఇంటి గోడలపై రాసుకొని మంత్రిపట్ల తమ ఆదరణను చాటుకుంటున్నారు. హరీష్‌రావు ప్రచారంలో కూడా అన్ని వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి. హరీషన్నకే మన ఓటు అని యువత సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తుంది. మంత్రి జూపల్లి, జోగు రామన్న, జగదీష్ రెడ్డికి గ్రామాల పర్యటనల్లో  కొన్ని ప్రజా సమస్యలు ఎదురవుతున్నాయి.
అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ప్రజలు మంత్రులను నిలదీసే ప్రయత్నం చేసిన సంఘటనలు కూడా అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది, సాంకేతిక కారణాలు, అధికారుల అలసత్వం కారణంగా కొన్ని పనులు చేయలేక పోయామని సర్ది చెప్పుతున్నారు. జోగు రామన్న కూడా ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.
అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకుంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మంత్రి కేటీఆర్ సనత్ నగర్ నియోజక వర్గం అభ్యర్ధి తలసాని శ్రీనివాస్ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి పక్షాన ఇప్పటికే ఎన్నికల ప్రచారం జరుగుతుంది.
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జక వర్గంలో తెరాస శ్రేణులు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందనే సమాచారంతో కొందరు అమాత్యులు ఆచి తూచి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. రెండు మాసాల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించడం కష్టంతో కూడిన పని అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:Ministers’ busy busy election campaign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *