ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి

యాదాద్రి భువ‌న‌గిరి  ముచ్చట్లు:

హరితహారం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కేంద్రంలో రూ. 21.13 లక్షల వ్యయంతో నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెసిడెన్సీ భవనాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి క‌లిసి ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెసిడెన్సీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ క్రిష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్, కలెక్టర్ పమేలా సత్పతి, సీసీఎఫ్ అక్బర్, డీఎఫ్‌వో డీవీ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమం సందర్బంగా  మంత్రులు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Ministers Indira Reddy and Jagadish Reddy inaugurated the Forest Range Officer building

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *