మంత్రులకు లోకల్ టెస్ట్

Date;28/02/2020

మంత్రులకు లోకల్ టెస్ట్

విజయవాడముచ్చట్లు:

ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికారపార్టీ నేతల్లో జోష్ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే మంత్రుల గుండెల్లో రైళ్లు

పరిగెడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. జగన్ మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలను సక్సెస్ చెయ్యాలనే  టాస్క్ అప్పగించారు. ఫలితాలు అధికార పార్టీ కి అనుకూలంగా వస్తే ఓకే…ఒక వేళ వ్యతిరేకంగా వస్తే ఏం జరుగుతోంది అనే టెన్షన్ మంత్రులలో నెలకొంది. 9 నెలల పాలనకు ఈ ఎన్నికలు మచ్చుతునకగా నిలవనున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది.  దీంతో జగన్ మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలను సక్సెస్ చెయ్యాలనే టాస్క్  అప్పగించారు. గత సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపధ్యంలో ఇప్పుడు కూడా స్థానిక సమరంలో విజయం సాధించాలని జగన్  భావిస్తున్నారు.అందుకే ఈ ఎన్నికల టాస్క్  ను మంత్రులకు అప్పగించారు . స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికారపార్టీ నేతలు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందుకు అనుకూలంగానే స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తూ ఉంటాయి.. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9నెలలు కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో  స్థానిక సంస్థల ఎన్నికలంటే ఆ పార్టీ నేతల్లో గుబులుపుడుతోంది.. పైకి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నా లోపల మాత్రం ఎంతో కొంత అసంతృప్తి ఉన్నట్లు  తెలుస్తోంది.మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల టాస్క్ ను  సీఎం జగన్ మోహ న్ రెడ్డి వైసీపీ మంత్రులకు అప్పగించారు. ఇక మంత్రులు స్థానిక సమరంలో సత్తా చాటితేనే మంత్రిగా వారికి  అవకాశం ఉండేది . లేదంటే మంత్రి పదవి ఊడుతుందనే సంకేతాలు కూడా ఇచ్చారని సమాచారం . దీంతో మంత్రులకు తమ పదవి నిలబెట్టుకోవాలంటే ఉరుకులు పెట్టాల్సిన పరిస్థితి  నెలకొంది.అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్ వంటి అంశాల దాకా అన్ని బాధ్యతలు మంత్రులకే అప్పగించినట్లు తెలుస్తోంది.. స్థానిక నేతలను, ఎమ్మెల్యేలను  సమన్వయపరచడం, విభేదాలను పరిష్కరించడం వంటి కీలకమైన బాధ్యత కూడా మంత్రులకే జగన్ అప్పగించారు.మరోవైపు ఎన్నికలు ముగిసే వరకూ మంత్రులు వారి శాఖల విషయాలు
పక్కన పెట్టి ఎన్నికలపైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ ఛార్జ్ మంత్రులతో పాటు లోకల్ మంత్రులు జిల్లాలకే పరిమితమై ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలని  సీఎం జగన్ ఆదేశించారట .  ఎన్నికల్లో పనితీరు సరిగా లేకుంటే మాత్రం ఉద్వాసన పలకటం ఖాయమే అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.దీంతో లోకల్ వార్ అంటేనే మంత్రులు భయపడుతున్నారు. సీఎం జగన్ తాజా నిర్ణయం మంత్రులకు టెన్షన్ కలిగిస్తోంది . ఇప్పుడు ఈ టాస్క్ సక్సెస్ చేస్తేనే జగన్ మంత్రులుగా గుర్తించేది. కాబట్టి ఆదేశాలు వచ్చినప్పటి నుంచి  ఎక్కువ సమయం జిల్లాలకే పరిమితమై ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జగన్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. ఇక మరో వైపు  ప్రతిపక్షాల నేతలు స్థానిక సమరాన్ని ఎదుర్కోటానికి సన్నాహాలు చేస్తున్నారు

 

Tags;Ministers-local-Test

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *