Natyam ad

వ్యవసాయ మార్కెట్ లో మంత్రి తుమ్మల తనిఖీలు

ఖమ్మం ముచ్చట్లు:


ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర తగ్గిందనే వార్తలు రావడంతో వ్యవసాయ శాఖా మంత్ర తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.మార్కెట్ మొత్తం కలియ దిరుగుతు రైతులను ధరల విషయాలు అడిగి తెలుసుకున్నారు.జెండా పాట 20 వేలు అని  మొక్కుబడిగా కొనుగోలు చేసి ఆ తరువాత  వివిధ కారణాలు చెప్పి 15 వేలకు కొంటున్నారని  రైతులు తుమ్మల దృష్టికి తీసుకు వచ్చారు.కొంత మిర్చిని 10 వేలకు కూడా కొంటున్నారు.    రైతు విషయం నిలదీస్తే కొనకుండా వెళ్తున్నారని రైతుకు వాపోయారు. దానితో మంత్రి మార్కెట్ అధికారులను, కొనుగొలుదారులపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ఎవరు పరిశీలిస్తారు అధికారి ఎక్కడని  రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని తుమ్మల హెచ్చరించారు.

 

Tags: Minister’s sneeze inspections in the agricultural market

Post Midle
Post Midle